చరణ్ అభిమానులకు కిక్కిచ్చిన అనసూయ

తమ అభిమాన కథానాయకులకు సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా అభిమానుల ఆనందానికి అవధులుండవు. పైగా తమ హీరో సినిమాలో నటిస్తున్న వాళ్లు ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడితే.. అందులోని ఏదైనా విశేషాల్ని పంచుకుంటే ఫ్యాన్స్ చాలా సంతోషిస్తారు. రామ్ చరణ్ అభిమానులకు అనసూయ ఇప్పుడు అలాంటి కబురే తెచ్చింది.

‘రంగస్థలం’ సినిమాలో చరణ్ తో కలిసి నటిస్తున్న అనసూయ ఈ చిత్రంలో ఓ కీలకమైన సన్నివేశం పూర్తి చేసిన అనంతరం చరణ్ తో కలిసి ఫొటో దిగింది. అందులో అనసూయ కొడుకు కూడా ఉన్నాడు. అనసూయ మామూలు డ్రెస్ లోకి వచ్చేయగా.. చరణ్ మాత్రం ‘రంగస్థలం’ కాస్ట్యూమ్స్ లోనే ఉన్నాడు.

ఈ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నిజంగా చరణ్ చాలా మంచి వ్యక్తి అని.. ‘రంగస్థలం’ సినిమా వచ్చే వరకు ఎదురు చూడమని.. అతను అందరూ గర్వించేలా చేస్తాడని కామెంట్ పెట్టింది. దీంతో ఇప్పటికే ‘రంగస్థలం’ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చరణ్ అభిమానుల్లో ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగింది. ‘రంగస్థలం’లో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంక్రాంతికి ‘రంగస్థలం’ ఫస్ట్ టీజర్ విడుదల చేస్తారని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు.. ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

SHARE