మీ వ్యక్తిత్వాన్ని,భవిష్యత్తును తెలిపే మీ కాలు, కాలి వేళ్ళ ఆకారం..

తలరాతను మార్చే శక్తి మనకు లేదంటారు. కానీ మన భవిష్యత్ ఎలా ఉంది.. మనం జీవితంలో ఎప్పుడు విజయం సాధిస్తాం.. ఎవరితో మన జీవితం ముడిపడి ఉంటుంది.. ఎలాంటి భార్య లేదా భర్త వస్తాడు.. ఎప్పుడు ఉద్యోగం వరిస్తుంది… ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతుంటారు.జీవితం గురించి ముందుగా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తపిస్తూ ఉంటారు. అలా పుట్టుకొచ్చిందే జాతకం. కొంతవరకైనా తమ భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చని చాలా మంది చేతి రేఖల ద్వారా, జన్మ నక్షత్రం ద్వారా కనుక్కుంటూ ఉంటారు. Image result for foot typesవిధి రాతలు తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా చేతి రేఖలు చూస్తున్నవాళ్లు ఉన్నారు.మరికొందరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వాళ్ల భవిష్యత్ గురించి అంచనా వేస్తారు. మరికొందరు ఫేస్ రీడింగ్ తో.. వాళ్ల జాతకం వివరిస్తారు. అయితే చేతిరేఖలే కాదు.. కాలి వేళ్లలోనూ జాతకం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పాదాల వేళ్ల ఆకారం బట్టి.. వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. మీ గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకోండి.Image result for Feet Can Describe Personality Typesరోమన్ ఫూట్::రోమన్ ఫూట్ అంటే.. మొదటి మూడు వేళ్లు ఒకే పొడవు ఉంటారు. తర్వాత రెండు వేళ్లు సమాన పొడవు ఉంటాయి. పెద్ద వేలి నుంచి మిగిలిన వేళ్లు 45 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఇలాంటి కాలి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీళ్లు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందులో ఎక్కువగా ప్రదేశాలు, సాంప్రదాయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కనపరుస్తారు. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలకు, పబ్లిక్ లో అనర్గళంగా మాట్లాడగలిగే వక్తలకు రోమన్ ఫూట్ ఉంటుంది.

గ్రీక్ ఫుట్ : దీన్నే ‘ఫైర్ ఫుట్’ లేదా ‘గ్రీక్ ఫుట్’ అని కూడా పిలువబడుతుంది. గ్రీక్ ఫూట్ ఉన్న వాళ్లు అదృష్టవంతులే. రెండో వేలు పెద్ద వేళి కంటే పొడవుగా ఉంటే దాన్ని గ్రీక్ ఫూట్ అంటారు. ఇలాంటి వేలు ఉన్నవాళ్లు కళాత్మకంగా, స్పోర్టీవ్ గా ఉంటారు. వీళ్లు చాలా ఉత్సాహభరితంగా ఉంటారు. ఇతరులను మోటివేట్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్లకు ఎక్కువగా దూకుడు స్వభావం ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆర్టిస్ట్ లు, అథ్లెట్స్ కి గ్రీక్ ఫూట్ ఉంటుంది. వీళ్లు కూడా పబ్లిక్ స్పీకర్స్, ఇన్నోవేటర్స్ గా చెప్పవచ్చు.స్క్వేర్ ఫూట్ : ఇది కాలి పొడవును సూచిస్తుంది. బొటనవేలు పెద్దగా ఉంటుంది. దీర్ఘచతురస్రాకారాన్ని సూచిస్తుంది. దీన్ని రైస్ ఫూట్ అని కూడా పిలుస్తారు.అన్ని వేళ్లు సమానమైన పొడవు కలిగి ఉంటే.. స్క్వేర్ ఫూట్ అంటారు. ఇలాంటి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆచు తూచి ఆలోచనలు తీసుకుంటారు. ప్రతిఫలం చాలా ఆచరణాత్మకంగా, నమ్మదగినదిగా ఉంటుంది.
స్ట్రెచ్డ్ ఫూట్ (Stretched Foot) పెద్ద వేలు.. అంటే బొటన వేలు పొడవుగా ఉండి.. దాని తర్వాత వేలులన్నీ క్రమంగా పొడవు తగ్గుతూ వస్తే.. దాన్ని స్ట్రెచ్డ్ ఫూట్ అంటారు. ఫ్రైవసీ కోరుకునే వాళ్లకు, తమ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని బయటపెట్టని వాళ్లకు ఈ స్ట్రెచ్డ్ ఫూట్ ఉంటుంది. వీళ్ల మూడ్ చాలా సడెన్ గా మారిపోతూ ఉంటుంది.

టాపరింగ్ ఫూట్ : టాపింగ్ ఫూట్, సన్నగా పొడవుగా ఉంటుంది. వేళ్ళు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. బొటనవేలు అన్నింటికంటే పెద్దగా కనబడుతుంది. ఈ రకమైన పాదాలు కలిగిన వ్యక్తులు చాలా గోప్యంగా వ్యవహరిస్తారు. వీరిలో హఠాత్తుగా, ఆకస్మికంగా మనస్సు మార్చుకుంటారు.రెండో వేళికి న్యారో బేస్ ఉంటే (Narrow Base) అంటే రెండో వేళి మొదట్లో ఇరుగ్గా ఉండి.. పైకి వచ్చే కొద్ది విశాలంగా ఉంటే.. అలాంటి వాళ్లు ఏ విషయాన్నైనా వ్యక్తీకరించగలుగుతారు. అయితే వీళ్ల మూడ్ సరిగ్గా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మూడ్ బాగోలేకపోతే అంతే సంగతులు. కాబట్టి.. మూడ్ బాగోలేదని గ్రహించినప్పుడు వాళ్లను ఒంటరిగా వదిలేయాలి. మళ్లీ మమూలు స్థితికి వచ్చాక పలకరించడం మంచిది.రెండో వేలికి మూడో వేలికి మధ్య దూరం రెండో వేలికి మూడో వేలికి మధ్య దూరం ఎక్కువగా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అలా ఉంటే.. మీ ఎమోషన్స్ ని పక్కనపెట్టి చేయాలనుకున్న పని చేస్తారు. చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మీరు చేస్తున్న వర్క్ నచ్చకపోతే వెంటనే ఇంకొకటి చూసుకుంటారు. అలా కొత్త కొత్త ఆలోచనలు, మార్పులతో సంతోషంగా ఉండాలనుకుంటారు.నాలుగో వేలి నుంచి చివరి వేలు విడదీయలేకపోతే నాలుగో వేలి నుంచి చివరి వేలుని విడదీయలేక పోతే అలాంటివాళ్లు.. రొటీన్ లైఫే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉందని ఫీలవుతారు. ఇలాంటి వాళ్లు చాలా నమ్మదగినవాళ్లు. ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు.. వీళ్లపై ఆధారపడి ఉంటడానికి ఇష్టపడతారు.

SHARE