మొదటి సెల్‌ఫోన్‌ గురుంచి ఆసక్తికరమైన విషయాలు?మీకు తెలుసా

సెల్‌ఫోన్‌..  ప్రపంచ గతిని మార్చేసింది. వ్యాపార, విద్య, వినోద, మీడియా రంగాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది.  అరచేతిలో ఇమిడిపోతున్న ఈ వస్తువు చుట్టూ ప్రస్తుతం ప్రపంచం తిరుగుతోంది. మాములు ల్యాండ్‌ ఫోన్‌ను అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ రూపొందించాడన్న విషయం మనకు తెలిసిందే.మరి మొదటిసారి ప్రపంచానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయనే మార్టిన్‌ కూపర్‌. ఆయన ఆలోచనల నుంచి పుట్టిన సెల్‌ఫోన్‌ ఇప్పుడు ఎన్నో మార్పులకు లోనై.. ఒక అద్భుతంగా మారింది. తన ఆవిష్కరణతో సాంకేతిక విప్లవానికి కారణమైన మార్టిన్‌ కూపర్‌ జీవిత విశేషాలు ఈరోజు ‘సైంటిస్ట్‌’లో మీకోసం… ఇప్పుడు ఇంతటీ సమూల మార్పుకు నాంది పలికిన తొలి వ్యక్తిగా మార్టిన్‌ కూపర్‌ నిలిచిపోతాడు.మొదటి సెల్‌ఫోన్‌ విశేషాలు…మొదటగా తయారు చేసిన ఫోన్‌ బరువు 1.1 కిలోలు,ఈ ఫోన్‌ ఒకసారి పూర్తి ఛార్జ్‌ చేయడానికి పదిగంటలు సమయం పట్టేది. దీంతో 30 నిమిషాలు మాట్లాడే వీలుండేది.1983లో మోటరోలా డైమా టీఏసీ 8000 ఎక్స్‌’ పేరుతో తొలి కమర్షియల్‌ ఫోన్‌ను విడుదలచేసింది. దీని ధర అప్పట్లోనే సుమారు రూ.3లక్షలు.

SHARE