రవితేజ సినిమాలో జగపతిబాబు పాత్ర ఏంటో తెలుసా!

హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్న తర్వాత జగపతిబాబుకి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. టాలీవుడ్ లోని అనేక పవర్ ఫుల్ పాత్రలు అతన్ని ఎతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా రవితేజ సినిమాలోనూ అదిరిపోయే రోల్ పట్టేసినట్టు సమాచారం. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండతో “టచ్ చేసి చూడు” సినిమా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ జనవరిలో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

దీని తర్వాత సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. “నేల టికెట్” అని పేరుతో తెరకెక్కనున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ లో మాళవిక శర్మ అనే బ్యూటీ హీరోయిన్ గా పరిచయం కానుంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా జగపతి బాబు ని తీసుకున్నట్టు తెలిసింది. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కొత్తగా కనిపించనున్నట్టు సమాచారం. జనవరి 5 న ప్రారంభం కానున్న ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించనున్నారు.

SHARE