స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూడా ఇంకా నెలకు 5 వేల అద్దే ఇంట్లోనే త్రివిక్రమ్ గడపడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇప్పుడు మనం చూస్తున్న టాప్ టాలీవుడ్ డైరెక్టర్ “త్రివిక్రమ్” సినిమా కష్టాలని చాలా రోజులే అనుభవించాడు. తినడానికి తిండి లేక ఉండటానికిఈ ఇల్లు లేక చాలా సంవత్సరాలు ఛాన్స్ కోసం వైట్ చేస్తూ గడిపాడు. అంతటి కష్ట కాలంలో డైరెక్టర్ త్రివిక్రమ్, సునీల్ మరియు డైరెక్టర్ దశరథ్ వీళ్ళందరు కలిసి ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. వీళ్ళందరు ఒకే రూమ్మేట్స్ అని కూడా చెప్పుకోవచ్చు.

హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకుని దాంట్లో విళ్లు ఉండేవారు. అక్కడికి వచ్చిన తరువాతే మన త్రివిక్రమ్ లో ఉన్న సృజనాత్మకత అనేది బయటపడింది అంట. రైటర్ పోసాని దగ్గర రైటర్ గా అవకాశం లభించిందట. పోసాని దగ్గర ఉండగానే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా స్నేహం ఏర్పడింది.

ఆ రూమ్ లో కూర్చొనే ఎన్నో హిట్ సినిమాలకు కథలు రాసాడు త్రివిక్రమ్. ఆ రూమ్ లో కూర్చొని చేసే ఏ పని అయిన సక్సెస్ అవుతుంది అని త్రివిక్రమ్ గట్టి నమ్మకం. ఆ రూమ్ లో ఉంటుండగానే దశరథ్ తొలిసారిగా “సంతోషం” సినిమాకి డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమాకి ఆ రూమ్ లొనే ఇద్దరూ కలిసిని కథను మరియు డైలాగ్స్ ను చర్చించుకుని రాసారు. ఆ సినిమాలో డైలాగ్స్ నాగార్జున కి బాగా నచ్చి మన త్రివిక్రమ్ కి “మన్మధుడు” సినిమా అవకాశం దక్కింది. ఆ తరువాత కాలంలో ఆ రూమ్ లో ఉన్న తన కొలిక్స్ స్టార్లు అయిపోయారు. పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. త్రివిక్రమ్ కూడా కట్టుకున్నాడు కానీ త్రివిక్రమ్ ఆ రూమ్ ని మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పటికి ఆ రూమ్ కి అద్దె చెల్లిస్తూ తన కోసమే అంటి పెట్టుకున్నాడు. అది చిన్న రెండు గదుల రూమ్ దానికి అద్దె ఐదు వేల రూపాయలు. కుడిరినప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉంటాడు అని అంటున్నాడు ఆ రూమ్ కింద ఉండే చిల్లర కొట్టు యజమాని. కొన్ని అంతే కొన్నిటితో అనుబంధంకూడా అంతే. ఎవ్వరికీ అర్థం కాదు ఆ లక్ ని అనుభవించే ఆహ్ వ్యక్తి కి తప్ప.

మరింత ఇన్ఫర్మేషన్ కోసం క్రింద ఉన్న వీడియో ని చూడండి. మీ విలువయిన కామెంట్స్ షేర్ చేసుకోండి.

SHARE