హలొ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సమంత

హలో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకి వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు “హలో” సినిమాని నాగార్జున వారి కుటుంబం చూసిందా? చూస్తే ఇప్పటికీ ఆ సినిమా గురించి ఏ కామెంట్స్ ఇవ్వలేదేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. చూసిన ప్రతి సినిమాకి ట్విట్టర్ రేటింగ్ ఇవ్వడం మరియు ఆ సినిమా గురించి పొగడడం సమంత కి అలవాటే కానీ ఇప్పటి వరకు మరిది సినిమా గురించి ఎందుకు పెట్టలేదు అనే ఆరోపణలు కూడా చాలనే వస్తున్నాయి.

విటన్నింటికి తెర దించుతూ నిన్న సాయంత్రం కుటుంబం మొత్తం స్పెషల్ షో వెపించుకొని మరి “హలో” సినిమా చూసారు. హలో సినిమా చూసిన నాగచైతన్య, సమంత సినిమా గురించి మాట్లాడుతూ, ఇలా అన్నారు విక్రమ్ మాకెమి కొత్త డైరెక్టర్ కాదు మాకు విక్రమ్ మీద మనం సినిమాతోనే మంచి నమ్మకం వచ్చింది మా ఫ్యామిలి కి విక్రమ్ ఎంతో ఆప్తుడు కాబట్టే తన చేతులో అఖిల్ ని పెట్టారు మావయ్య అని చెప్పింది సమంత. అఖిల్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించడు అని తన పట్టుదలతో చేసిన ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని చెప్పుకొచ్చింది సమంత.

అంతేకాకుండా ఈ సినిమాకి విక్రమ్ ఎంతో కష్టపడ్డాడు అని అఖిల్ లో ఉన్న టాలెంట్ ని బయటకు తెచ్చి తాను ఏంటో తనకి విక్రమ్ చూపించాడు అని చెప్పింది. ఈ సినిమాకి విక్రమ్ మరియు మావయ్య దగ్గర ఉండి ఏ తప్పు లేకుండా ప్రతి చిన్న విషయంలో శ్రద్ద తీసుకొని చేయడం వల్ల ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది అని చెప్పింది. ఏది ఎం అయినప్పటికీ ఫస్ట్ సినిమా ప్లాప్ అయిన సెకండ్ సినిమాలో మంచి జోష్ తో ముందుకు వచ్చిన అఖిల్ కి ఈసారీ అయిన హిట్ దక్కుతుందో లేదో చూడాలి.

SHARE