2018 లో మహేష్ నుండి ఈ రెండు మాత్రం ఖాయం!

2015 లో శ్రీమంతుడు.. 2016 లో బ్రహ్మోత్సవం.. 2017 లో స్పైడర్.. ఏడాదికి ఒకటి చొప్పున మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమ హీరో నుంచి ఎక్కువ సినిమాలు రావాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండు కోరికలను మహేష్ 2018 లో తీర్చబోతున్నారు. అతను నటించిన రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. పొలిటికల్ వ్యవస్థపై సెటైర్ కల్ గా కొరటాల చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.

ఎన్ని సినిమాలు పోటీకొచ్చిన అదే తేదీన రిలీజ్ చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య పక్కా ప్లాన్ తో ఉన్నారు. దీని తర్వాత వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రం కోసం డైరక్టర్, డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు. లొకేషన్స్ తో మ్యూజిక్ పని కూడా గత నెల మొదలు పెట్టారు. ఇప్పటికే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మూడు ట్యూన్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం. అశ్వినీదత్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళుతుందని… దీపావళి రిలీజ్ అవుతుందని సమాచారం. సో మహేష్ అభిమానులకు ఇది శుభవార్తే.

SHARE