మొదలైన భరత్ అనే నేను కొత్త షెడ్యూల్

మొన్నటి వరకు ఫుల్ గా ఎంజాయ్ చేసిన మహేష్ బాబు నేటి నుంచి వర్క్ మోడ్ లోకి వెళ్లారు. గత చిత్రం స్పైడర్ నిరాశపరిచినప్పటికీ ఆ చిత్ర ప్రభావం తనపై పడకుండా మహేష్ కుటుంబసభ్యులతో కలిసి టూర్ ప్లాన్ చేశారు. గత నెల 24 వరకు తమిళనాడులోని కారైకుడి వద్ద షూటింగ్ లో పాల్గొన్న మహేష్ లాంగ్ లీవ్ తీసుకున్నారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార తో కలిసి కలిసి విదేశాలకు వెళ్లారు. క్రిసమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొత్తం అక్కడే జరుపుకున్నారు. ఒమన్ దేశంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టారు. టూర్ ముగించుకొని ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి ఏరియాలో మొదలైన కొత్త షెడ్యూల్లో పాల్గొన్నారు.

మహేష్ తో పాటు కొందరు ఇతర నటీనటులపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొననుంది. కొన్ని డ్రామా సీన్స్ తో పాటు ఒక యాక్షన్ సీన్ కూడా ఇక్కడ తీయనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించనున్నారు. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు కనిపించనున్న ఇందులో పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో లౌడ్ కామెడీ చేయనున్నారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ అపజయాలతో సతమవుతున్న మహేష్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొరటాల ఎంతో శ్రద్ధతో చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.

SHARE