దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ దెబ్బ

పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే చాలు అసలు కంటెంట్ చూడకుండా కొనేస్తారు డిస్ట్రిబ్యూటర్లు. సర్దార్ గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు సినిమాలకు లాస్ వచ్చిన అది మినిముమ్ లాస్ కాబట్టి పాటించుకోలేదు. కానీ ఆజ్ఞతవాసి సినిమాకి మాత్రం అలా కాదు త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో మరియు అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు అసలు వెనక్కి తగ్గకుండా పక్క హిట్ అన్న ఆలోచనతో ఏమి ఆలోచించకుండా కొనేశారు. కానీ నిన్న రిలీజ్ అయిన సినిమా చూసిన తరువాత హిట్ లాగా అనిపించలేదు. అంతేకాకుండా అసలు పవన్ ఫాన్స్ కూడా సినిమా చూసిన తర్వాత అసలు జీర్ణించుకోలేక పోయారు. సినిమా ఒక్క వారం ఆడటం కూడా కష్టం అంటున్నారు. ఒక్కటంటే ఒక్క వెబ్సైట్ కూడా సినిమాకి పోసిటివ్ టాక్ ఇవ్వకపోవడంతో అసలు జనాలు సినిమాని చూడకుండానే సినిమా ఫ్లాప్ అంటూ వెళ్ళడానికి ఆశక్తి చూపించడం లేదు.

ముఖ్యంగా తెలంగాణలో సినిమా టాక్ అంతగా లేదు. ప్రీమీయర్ షోలకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం..అదనపు షోలకి అనుమతి లభించకపోవడంతో మరియు టికెట్ ధర ని పెంచడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోవకపోవడంతో ఆజ్ఞతవాసి వసూళ్లు భారీగా పడిపోయాయి అని చెప్పుకోవచ్చు. నైజాంలో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఐదున్నర కోట్లు రబట్టిందని.. ఇంకా రావాల్సింది చాలా ఉందని.. మరో వైపు పోటీలతో వస్తున్న సినిమాలు ఉండటంతో నైజం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్రాజు కి పెద్ద టెన్షన్ పట్టుకుంది అని ట్రేడ్ పండితులు చెపుతున్నారు.

SHARE