నాగార్జున రామ్ గోపాల్ వర్మ “ఆఫీసర్” ఫస్ట్ లుక్ రిలీజ్

Nagarjuna Ram Gopal Varma first look poster

రామ్ గోపాల్ వర్మ తన ఫేవరెట్ హీరో “నాగార్జున” తో సినిమా తీస్తున్నాడు అన విషయం మనకి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంతక ముందు “NAGRGV4” అని పెట్టారు,ఐతే ఇపుడు ఆ సినిమాకి “ఆఫీసర్” గా టైటిల్ ఫిక్స్ చేసారు. అవును ఇప్పుడు ఈ టైటిల్ సోషల్ మీడియా లో రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేసారు. నాగార్జున హీరో గ చేస్తున్నాడు, మైర సారీన్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తుంది.

ఈ సినిమాకి సంబందించి, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలస్తుంది. ఆఫీసర్ టైటిల్, ట్యాగ్ లైన్ గా “Cops were never this scary”. దీనిబట్టి చూస్తే సినిమా మంచి ఆక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది.

RGV నిర్మాణ సంస్థ ‘కంపెనీ’ ఈ సినిమాని నిర్మిస్తోంది. ముంబైలో చిత్ర షూటింగ్ చాలా జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మే 25 వ తేదీన సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం యొక్క బడ్జెట్ తెలియకపోయినా, ఉత్పత్తి విభాగానికి దగ్గరగా ఉన్న మూలాలు 15-20 కోట్ల మధ్య ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున నిజాయితీ మరియు నిర్భయమైన పోలీసు పాత్ర పోషిస్తున్నారు. మొత్తం కథ ఒక చిన్న అమ్మాయి చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది.

SHARE