సాయి పల్లవి మీద మనసు పడ్డ మంత్రి కొడుకు..!

సాయి పల్లవి మీద మనసు పడ్డ మంత్రి కొడుకు..!

హీరోయిన్ సాయి పల్లవి ఒక్కేఒక్క తెలుగు సినిమా తో మన తెలుగు వారిని అందరిని తన మాయలో పడేసింది. ఆ సినిమా ఫిదా.. ఈ ఫిదా బ్యూటీ కి ఈ సినిమా తర్వాత తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఆఫర్లు బాగానే పెరిగాయి. అంతే కాకుండా సాయి పల్లవికి పలు వివాదాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న విషయం వింటే అందరూ షాక్ అవ్వాలిసిందే.

సాయి పల్లవి పెర్సొనల్ విషయాల మీద వార్తలు రావడం చూసి మండిపడిపోతున్నారు. తన అభిమానులు. సినిమాల వరకు ఊహాగానాలు ఒకే కానీ పర్సనల్ విషయాలలో ఊహాగానాలు ఏంటి అంటూ విరుచుకుపడ్డారు. మరి ఆ వార్తలో నిజం ఉందా ఇంతకి ఆ వార్త ఏంటి అంటే.

సాయి పల్లవి మీద ఒక మంత్రి కొడుకు మనసు పడ్డారని, కానీ సాయి పల్లవి తిరస్కరించింది అని ఆ వార్తల సారాంశం. ఇందులో నిజ నిజాలు పక్కన పెడితే ఇప్పటి వరకు సాయి పల్లవి నుండి ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు. ప్రకటన లేకుండా ఇలాంటి ప్రచారం సరికాదని అంటున్నారు సాయి పల్లవి ఫాన్స్.

SHARE