బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన స్పైడర్!

బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన స్పైడర్!

వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి దేశ వ్యాప్తంగా పలు రికార్డులు సాధించిన విష్యం మనందరికీ తెలిసిందే. అంతటి తోనే ఆగకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రికార్డు ల సునామీ ని సృష్టించింది బాహుబలి. ఇక మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ మాత్రం మహేష్ బాబు కెరీర్ లొనే పెద్ద డిజాస్టర్ గా మారింది. అలాంటిది బాహుబలి2 రికార్డులు ను స్పైడర్ ఎలా బద్దలు కొట్టింది అంటారా. అవునండీ ఇది నిజం సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన సినిమా స్పైడర్. 

భారీ అంచనాలతో విడుదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డ విషయం అందరికి తెలిసిందే. తెలుగులో అన్ని వర్గాల ఫాన్స్ కి బాగా కనెక్ట్ అయిన మహేష్ బాబు ని మురుగదాస్ కరెక్ట్ గా ఉపయోగించుకోలేక పోయారని.. ఈ సినిమాలో హీరో పాత్రకంటే విలన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పలు విమర్శలు ఎదుర్కున్నారు. మురుగదాస్ కంటెట్ బాగున్నా సరైన పద్దతిలో పోకపోవడం ఏ మాత్రం మాస్ ఆడియన్స్ కోసం మసాల లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. 

ఈ విషయం పక్కన పెడితే బాహుబలి2 ని అడిగామించింది మహేష్ బాబు స్పైడర్. అది ఎలా అంటే గత ఆదివారం సన్ టీవీ లో స్పైడర్ సినిమా తమిళ్ వెర్షన్ ను ప్రసారం చేశారు. దీన్ని డైరెక్ట్ చేసింది మురుగదాస్ కావడం తో ఎస్. జె సూర్య పాత్ర ఆకట్టుకోవడంతో 10.4 టీ ఆర్ పి ని సంపాదించింది ఈ చిత్రం. ఇంత వరకు టేలివిసోన్ చరిత్రలో తమిళ్ లోకి డబ్ అయిన తెలుగు సినిమాల లో బాహుబలి2 అత్యంత రికార్డ్ ను నమోదు చేసింది. అది 10.33 కానీ ప్రథమ స్తానం లో ఉన్న బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసింది స్పైడర్ రికార్డ్. మొత్తానికి ఈ విషయం లో మహేష్ బెటర్ అనిపించుకోవడంతో ఫాన్స్ అందరూ సంతోషంగా ఉన్నారు.

SHARE