గేట్ దూకి పారిపోయిన స్టార్ హీరో “సూర్య”..

ఏంటి టైటిల్ చూసి ఆశ్చర్య పోతున్నారా. ఇది అబద్దం కాదండి నిజమే. నిజంగానే మన హీరో సూర్య గేట్ దూకి పారిపోయాడు. అరె అంత పెద్ద హీరో సినిమాలో స్టంట్స్ చేయాలి కానీ రియల్ లైఫ్ లో స్టన్స్ చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారా. అవును వార్త విన్న మేము కూడా అంతే షాక్ అయ్యాము కానీ నిజంగా జరిగింది అని తెలిసిన తరువాత ఆశ్చర్యపోయాము. అసలు సూర్య కి ఇంత కర్మ ఎందుకు పట్టింది గేట్ లో నుండి డైరెక్ట్ గా వెళ్లాల్సిన వాడు ఇలా గేట్ దూకి పారిపోవడం ఏంటి?

విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రిలీజ్ అయిన సూర్య సినిమా “గ్యాంగ్” సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ప్రమోషన్ కోసం సూర్య పడరాని పాట్లు పడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమోషన్ పని మీద రాజమహేంద్రవరం వెళ్లిన సూర్య షాక్ అయ్యాడు అతను ఉహించినదనికంటే ఎక్కువ మంది అభిమానులు తనని చూడటానికి, తనతో సెల్ఫీ దిగడానికి వచ్చారు. అక్కడ ఉన్న అభిమానులని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అసలు సినిమా హాలు లో నుండి బయటికి కూడా వెళ్ళడానికి వీలు లేనంత మంది అభిమానులు ఉండటం తో ఎం చేయాలో తెలియక హీరో సూర్య మరియు అతని బృందం గోడ దూకి వెళ్ళాల్సివచ్చింది. గోడ దూకిన వెంటనే తాను బౌన్సర్స్ తో కలిసి కారులో కూర్చొని వెళ్లిపోయారు. ఏది ఎం అయినప్పటికీ తెలుగు ప్రజల అభిమానం చూసిన సూర్య మాత్రం షాక్ అయ్యాడని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.

SHARE