బడ్జెట్ వల్ల ముల్టిస్టారర్ ఫిల్మ్ కి రాజమౌళి వెనక్కి తగ్గారా..

ఇటీవల రిలీజ్ అయిన స్పైడర్, ఆజ్ఞతవాసి చిత్రాలు టాలీవుడ్ కి గుణపాఠాలు గా మారాయి.. బడ్జెట్ బుడగలు పెళుతుండటంతో రెమ్యూనరేషన్ దందాలు దారికి వస్తున్నాయి.. భారీ సినిమాల బడ్జెట్ లో సగం హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ ఉండటం భారీ సినిమాల నిర్మాతలకి భారంగా మారిపోయింది.. స్పైడర్, ఆజ్ఞతవాసి చిత్రాల పరాజయాలు.. డిస్ట్రిబ్యూటర్లను దారుణ పరిస్థితుల్లోకి నెట్టాయని చెప్పుకోవచ్చు.. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి ఒక తెలివయిన నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్తా ప్రచారం మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతుంది.. అది ఏంటి అంటే.. బాహుబలి 2 తరువాత రాంచరణ్, ఎన్టీఆర్ తో రాజమోళి సినిమా ప్లాన్ చేసాడని అందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ చిత్రాన్ని వందకోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అన్న వార్త కూడా ప్రచారంలో ఉంది..

ఇక రాజమౌళి ఆ వార్తలకు విరుద్ధంగా ప్లాన్ బి రెడి చేసినట్టు సమాచారం.. వందకోట్ల బడ్జెట్ తో కాకుండా సినిమాను నలబై కోట్ల బడ్జెట్ తోనే సినిమాను పూర్తి చేయడానికి.. జక్కన రెడి అయ్యాడట… అంతే కాదండోయ్ ఈ సినిమాలో స్టార్ల రెమ్యూనరేషన్ కూడా ఉండదని ఒక ప్రచారం.. ఒక వేళ అదే నిజం అనుకుంటే ఈ సినిమాను కేవలం నలబై కోట్లతో తీయడం సాధ్యమవుతుందా.. మెగా హీరో మరియు ఎన్టీఆర్ వాళ్ళ రెమ్యునరేషన్ ఏరియా వారిగా పర్సన్టేజ్ ఇచ్చే విదంగా స్కెచ్ వేశాడంటా.. లాభాల నుండి పర్సెంటేజ్ వారిగా రెమ్యూనరేషన్ తీసుకునే విదంగా ప్లాన్ రూపొందించడంటా… రెమ్యూనరేషన్ లేకుండా సినిమా తీయడం వల్ల నిర్మాతల పైన ఎలాంటి భారము ఉండదని ఆలోచన… పరిమితుల తోనే సినిమా నిర్మాణం పూర్తవుతుంది.. దీని వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది అనే మాట కూడా వినిపిస్తోంది..

SHARE